Tuesday, April 30, 2024

బాలాపూర్ లో యువకుడు కిడ్నాప్‌.. దారుణ హత్య

బాలాపూర్‎లోని పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో యువకుడు కిడ్నాప్‌, దారుణ‌ హత్య ఘటన చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 12న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తున్నాని ఇంట్లో చెప్పిన వెళ్లిన ఫైజల్ కనిపించకుండా పోవ‌డంతో.. తమ కొడుకు ఇంటికి తిరిగిరాకపోవడంతో 13న తల్లిదండ్రులు బాలాపూర్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు. ఉస్మాన్‎నగర్‎కు చెందిన షా ఫైజల్ హత్యకు గురి కాబడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. దుండగులతో కలిసి కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చారు. బండరాయితో తలపై మోదీ హంతమొందించారు. ఈ హత్యకు గల కారణం తన స్నేహితుడు జాఫర్‎గా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. చిన్నపాటి గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు, నిందితుడు కలిసి ఇద్దరూ ఒకే చోట జాబ్ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement