Thursday, December 7, 2023

Hyderabad Metro Rail | మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్.. కేవలం 59 కే అన్‌లిమిటెడ్ జర్నీ

హైదరాబాద్ మెట్రో రైల్ తమ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూప‌ర్ సేవర్ ఆఫర్‌ను తిరిగి ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో కేవలం కేవలం రూ.59 కే అన్‌లిమిటెడ్ జర్నీ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫ‌ర్ సెప్టెంబర్ నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులందరూ లిస్టెడ్ సూపర్ సేవర్ సెలవు దినాలల్లో రూ.99కి బదులుగా కేవలం రూ.59తో మెట్రోలో అన్‌లిమిటెడ్ జర్నీ చేయ‌వచ్చు.

- Advertisement -
   

ఈ ఆఫర్ 31 మార్చి 2024 వరకు జాబితా చేయబడిన అన్ని సూపర్ సేవర్ సెలవు దినాలలో చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం, దయచేసి www.ltmetro.com వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏదైనా మెట్రో స్టేషన్‌ని సందర్శించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement