Friday, May 3, 2024

Hyderabad – ఆరాజెన్ విస్తరణ – రూ.రెండు వేల కోట్ల పెట్టుబడులు..

దావోస్ – తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్ గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరమవనుంది. దావోస్​లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో మణి కంటిపూడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement