Monday, April 29, 2024

నవంబర్‌ 5 తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్..?

హుజురాబాద్ ఉపఎన్నికలపై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.. ఈటల రాజేంధర్ బీజేపీలో చేరడం..క్రితం సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.. ఈటల రాజేందర్ కి చెక్ పెట్టాలనే టీఆర్ ఎస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గెలుపు కోసం అధికార పార్టీ అయితే.. అన్ని వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌశిక్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ లో చేర్చుకోగా.. ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కూడా లాగే ప్రయత్నాల్లో ఉంది. ఇది ఇలా ఉండగా.. ఈ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్‌ మొదలైందని సమాచారం అందుతోంది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌… నవంబర్‌ 5 తర్వాత వెలువడే ఛాన్స్‌ ఉన్నట్లు.. అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఉపఎన్నికల షెడ్యుల్‌ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్‌ ఉపఎన్నికపైనే ఉంది. 

ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్: అదరగొట్టిన బాక్సర్ లవ్లీనా..క్వార్టర్ ఫైనల్స్ కి ఎంట్రీ

Advertisement

తాజా వార్తలు

Advertisement