Friday, May 3, 2024

నాని…సుందరంగా మారిపోయాడు!!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే దీంతోపాటు నాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది.

ఈ నేపథ్యంలోనే తాను అంటే సుందరానికి షిఫ్ట్ అయినట్లు చెప్పుకొచ్చాడు నాని. అంటే సుందరానికి మేకోవర్ లోకి సింపుల్ గా మారిపోయినట్టు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా… నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

https://www.instagram.com/p/CRy0GRljUgS/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement