Monday, April 29, 2024

కరోనా పిడుగు.. 23 శాతం తగ్గిన ఇళ్ల అమ్మకాలు

దేశంలో కరోనా విజృంభణతో నిర్మాణ రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలు ఇళ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. హైదరాబాద్‌ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో విక్రయాలు జనవరి-మార్చితో పోలిస్తే సగటున 23% తగ్గాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే 83% వృద్ధి కనిపించినట్లు స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య 19,635 గృహాలు అమ్ముడయ్యాయని పేర్కొంది. జనవరి-మార్చిలో మొత్తం 25,583 యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో 10,753 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

బెంగళూరులో ఈసారి విక్రయాలు పెరిగాయి. ఇక్కడ మొత్తం 3,500 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 తొలి మూడు నెలలతో పోలిస్తే..రెండో త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 15% క్షీణించాయి. అయితే 2020 జనవరి-జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో అమ్మకాలు 62% పెరిగినట్లు  నివేదిక వెల్లడించింది. ఇక్కడ కొత్త నిర్మాణాలు బాగా పెరిగాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8,591 కొత్త యూనిట్ల నిర్మాణం ప్రారంభం కాగా.. రెండో త్రైమాసికంలో వీటి సంఖ్య 10,980 చేరింది. మొత్తం మీద హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో 28 శాతం వృద్ధి కనిపించింది.

ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 34 వేల కరోనా కేసులు నమోదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement