Thursday, May 2, 2024

దేశంలో కొత్తగా 34 వేల కరోనా కేసులు నమోదు..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నిర్థారణ అయ్యాయి. రోజువారీ కేసుల కంటే ఎక్కువ మంది బాధితులు కోలుకుంటుండడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 4.64లక్షలకు తగ్గి.. 101 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని చెప్పింది. తాజాగా వైరస్‌ నుంచి 51,864 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97.17శాతానికి పెరిగిందని తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.40శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.11శాతానికి పడిపోయిందని మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో కరోనా టెస్టులు గణనీయంగా నిర్వహించినట్లు పేర్కొంది. సోమవారం నాటికి 42.14కోట్ల శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది. కరోనా టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 35.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: మందుబాబుల‌కు శుభ‌వార్త‌..తగ్గిన బీరు ధరలు.. అర్ధరాత్రి నుంచే అమలు

Advertisement

తాజా వార్తలు

Advertisement