Friday, March 29, 2024

టీటీడీలో ప్రభుత్వ జోక్యం ఉండరాదు: పయ్యావుల కేశవ్

తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పీఏసీ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ దేవాలయాలను ధర్మకర్తల మండలి, పీఏసీ పరిధిలోకి తేవాలంటే గవర్నర్ ఆమోదం తెలపాలన్నారు. టీటీడీలో ప్ర‌భుత్వ జోక్యం ఉండ‌కూడ‌ద‌ని పయ్యావుల అభిప్రాయపడ్డారు. తిరుమల స్వయంపాలక క్షేత్రంగా ఉండాల‌నేది 100 కోట్ల మంది హిందువుల ఆకాంక్ష అన్నారు. ఇదే ప్ర‌తిపాద‌న‌ను దిగవంత నేత ఎన్టీఆర్ కూడా తీసుకొచ్చారని పయ్యావుల గుర్తుచేశారు.

ఒక మత సమస్యను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదని, హిందూ ధర్మం విషయంలో ప్రభుత్వ జోక్యం అనవసరమన్నారు. తిరుమల స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాల‌నే దానిపై బోర్డు స‌భ్యులు, గ‌వ‌ర్న‌ర్‌తో మాట్లాడ‌తాన‌ని చెప్పారు. తిరుమల స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాల‌నే దానిపై బోర్డు స‌భ్యులు, గ‌వ‌ర్న‌ర్‌తో మాట్లాడ‌తాన‌ని పయ్యావుల పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వాహనమిత్రకు దేవదాయ నిధులు మళ్లించలేదన్న ఏపీ హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement