Sunday, April 28, 2024

హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.… మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ – తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని కోరుతూ కరీంనగర్ మీ సేవా కార్యాలయంలో ఉన్న బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు..
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా సందర్భాల్లో హోంగార్డులను కానిస్టేబుల్ గా చేస్తామని హామీ ఇచ్చారని వినతిపత్రంలో హోం గార్డులు పేర్కొన్నారు.. విధి నిర్వహణలో కానిస్టేబుల్ తో సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నామని, మాకు కూడా ప్రభుత్వం నుండి లభించే జీవిత బీమా, ఆరోగ్య భద్రత,ఉద్యోగ భద్రత,మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అభ్యర్ధించారు. ఇలాంటివి ఏవి హోంగార్డుకు లేకపోవడంతో పదవి విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వినతిపత్రంలో వివరించారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గంగుల ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సీఎం కెసిఆర్ ప్రతి విషయాన్ని మానవీయకోణంలో ఆలోచిస్తారని, హోంగార్డు సేవలను గుర్తించి త్వరలో వారికి కూడా గుడ్ న్యూస్ చెప్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement