హైదరాబాద్: ట్యాంక్ బండ్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దని హైకోర్టు పునరుద్ఘాటించింది. కృత్రిమ కొలనుల్లోనే పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకొని అమలు చేయాలని సీపీని హైకోర్టు ఆదేశించింది. అమలు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నగర పాలకసంస్థ కమిషనర్ కు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -