Sunday, May 19, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర భారీ భద్రత

శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లు కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఆటగాళ్లకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్లేయర్స్ హోటల్ కు వెళ్లనున్నారు. ఆటగాళ్లు హోటల్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement