Friday, October 4, 2024

Heavy Rush – రాజన్న సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

వేముల‌వాడ – దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. తెల్లవారుజామున ధర్మ గుండం లో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. సుమారు 50000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసామని ఆలయ ఇన్చార్జి ఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement