Tuesday, May 21, 2024

సిట్టింగ్ ల‌కే సీట్లు – ఆశావ‌హుల పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో క్షేత్రస్థాయి నాయకుల్లో కలవరం మొదలైంది. ఇప్పటివరకు గడిచిన రెండు పర్యాయాల్లో ప్రయత్నం చేసి, ఈసారైనా టిక్కెట్‌ వస్తుందని గట్టి ధీమాతో ఉన్న కొంతమంది నేతల్లో అసం తృప్తి జ్వలలు రగులుతున్నాయి. ‘సిట్టింగులకే సీట్లు’ అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వరంగల్‌ వేదికగా స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత క్షేత్రస్థాయి కొన్ని నియోజక వర్గాల్లో నాయకులు తీవ్రమైన నిరాశతో ఉన్నారు. ప్రతి అసెంబ్లిd నియోజకవర్గంలో ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జి వేర్వేరు గా ఉండడంతో అంతర్గత కుమ్ములాటలు జరిగే ప్రమాదం పొంచివుంది. దాదాపు 50 కీలకమైన నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురేసి నాయకులు పార్టీ టిక్కెట్ల కోసం గట్టి ప్రయ త్నాలు చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో ఇప్పటికే రెండు పర్యా యాలు ఎమ్మెల్యే పదవుల్ని చేపట్టినవారు ఉన్నారు. ఈ క్రమం లో అధిష్టానం సిట్టింగులకే ప్రాధాన్యత ఇస్తే కొరివితో నెత్తి గోక్కున్నట్లేనని రాజకీయ విశ్లేష కులు అభిప్రాయ పడుతున్నారు. అధినేత తన స్థాయిలో అలాంటి నాయకుల్ని పిలిపించి సము దాయించే ప్రయత్నం చేసినా, సరిగ్గా ఎన్నికల సమయంలో మనస్పూర్తిగా సహకరిస్తారన్న నమ్మకంలేదు. అంతకంటే ముందుగా బీఆర్‌ఎస్‌ అధినేత, కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఈ మధ్యకాలంలో స్పీడ్‌ పెంచారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆశావహుల భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరో ఐదేళ్ళు తమకు అరణ్యవాసం తప్పదన్న ఆవేదన ఇప్పటికే కొందరిలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు గెలిస్తాయని అధినేత గట్టి ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది.


ఇదివరకు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ విధేయులుగా ఉన్న కార్యకర్తలతో పాటు- టికెట్‌ ఆశించిన వారంతా అయోమ యంలో పడ్డారు. ఈసారి కూడా తమకు పార్టీ టిక్కెట్‌ రాక పోవచ్చని, దీంతో మరో ఐదేళ్లపాటు- తమకు అరణ్యవాసం తప్పదనే ఫీలింగ్‌ ఇప్పుడు మొదలైంది. ఆ కోవకు చెందిన నాయకులంతా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ తమ ఆవేదనను, ఆక్రోశాన్ని
పంచుకుంటున్నారు. వారి ఈ దుస్థితికి తోడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సైతం టీ-ఆర్‌ఎస్‌, వామపక్షాల పొత్తుపై ధీమాతో ఉన్నారు. వామపక్షాలకు ఎన్ని సీట్లు- ఇస్తారో తెలియదు గానీ అలాగే వామపక్షాలకు ఏ సీటు- కేటాయిస్తారోనని కొన్ని నియోజవర్గాల్లో సిట్టింగుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. కనీసం 30 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వామపక్ష ఓట్లు- కీలక పాత్ర పోషిస్తున్నందున తమ స్థానాలను నిలబెట్టు-కోవడంపై తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. వామపక్షాలు ఈసారి 16 సీట్లు- అడిగినట్లు- సంబంధిత రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, టికెట్‌ ఆశించే వారికి ఉన్న మరో ప్రధాన సమస్య ఏమిటంటే ప్రభుత్వం వారి ఫోన్లను ట్యాప్‌ చేస్తారన్న భయం, ఇతర పార్టీలకు చేరువ కావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్‌కు వెంటనే తెలిసిపోతుందన్న ఆందోళన వెంటాడుతోంది. దీంతో పార్టీలో నిబద్దతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేస్థాయి నాయకులు ఇతర పార్టీల్లోని తమ స్నేహితులను కూడా పిలిపించుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతానికి, పలువురు ఎమ్మెల్యేలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటు-న్నారు. ఇతర పార్టీల నాయకులను ఎలా సంప్రదించాలో వారికి అంతుచిక్కడం లేదు. టీ-ఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగడంతో ఆశావహులంతా కిమ్మనకుండా లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు, రోహిత్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హర్షవర్ధన్‌ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటు-న్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే విధంగా కనీసం 40కి పైగా నియోజకవర్గాల్లో పతాకస్థాయిలో అంతర్గత కలహాలు, గ్రూపు తగాదాలు నెలకొన్నాయి.
కొన్నిచోట్ల సిట్టింగులకూ కష్టకాలమే
ఈ నేపథ్యంలో జూపల్లికి పార్టీ అవకాశం ఇస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక గద్వాల నియోజకవర్గానికి సంబంధించి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, సిట్టింగు కాబట్టి ఆయనకే టికెట్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నుంచి పోటీ- చేయడానికి జడ్పీ చైర్‌పర్సన్‌ సరితాతిరుపతయ్య కూడా ఆసక్తిగా ఉన్నారు. సిట్టింగులకు సీటు- ఇస్తే.. సరితా తిరుపతయ్య పార్టీలో ఉండి పని చేసుకోవడమో లేదా ఇతర పార్టీల్లోకి జంప్‌ అయ్యి, అదృష్టాన్ని పరీక్షించుకోవడమో చేయాల్సి ఉంటు-ంది. ఇక అలంపూర్‌ నియోజకవర్గం నుంచి ఆశావహులు భారీగానే ఉన్నారు. సిట్టింగులకు సీట్లు- ఇస్తే ఈ నియోజకవర్గం టికెట్‌ డాక్టర్‌ వీఎన్‌ అబ్రహాంకే దక్కుతుంది. ఆశావహుల్లో ప్రధానంగా మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఆసక్తిగా ఉన్నట్లు- తెలుస్తోంది. మాజీ జడ్పీచైర్మన్‌ బండారి భాస్కర్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. అలాగే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ కూడా ఇటీ-వల కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తాను ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్నట్లు- కొంతమంది అభిప్రాయప డుతున్నారు.
టిక్కెట్ల కోసం ముఖ్య నాయకులపై ఆశలు
ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న వారిలో కొందరు నేరుగా సీఎం కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నవారు కాగా, మరికొందరు పార్టీలోని ముఖ్య నాయకులపైన ఆశలు పెట్టు-కున్నారు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమకు టికెట్‌ వచ్చేలా కృషి చేయాలని కోరుకుంటు-న్నారు. అయితే పార్టీలో సీఎం కేసీఆర్‌దే అంతిమ నిర్ణయం కాబట్టి.. ఆశావహుల్లో ఎవరిని ప్రోత్సహిస్తారో ఇప్పటికిప్పుడు తెలియదు. అయితే గత ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు- అని ప్రకటించినప్పటికీ, చివరిలో కొన్ని మార్పులు చేశారు. దీంతో ఈసారి కూడా అలాగే చేస్తే తమకు అవకాశం వస్తుందనే ధీమా కూడా ఆశావహుల్లో ఉంది. ఒకవేళ చివరి వరకు తమకు టికెట్లు- రాకపోతే ఇందులో కొంతమంది ఆశావహులైనా పార్టీ మారి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతోంది. పలు ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతోపాటు- ఓటు- బ్యాంకు పెరిగిందనే ధీమాతో ఉంది. టీ-ఆర్‌ఎస్‌లో ఆశావహులుగా ఉన్నవారిని లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు వారు పార్టీ మారే అవకాశం లేకపోయినప్పటికీ, భవిష్యత్‌లో వారికి కాంగ్రెస్‌, బీజేపీ టికెట్లు- వచ్చే అవకాశం ఉంది. అలంపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు, గద్వాల నియోజకవర్గంలో బీజేపీకి ఇప్పటికే స్ట్రాంగ్‌ లీడర్లు ఉన్నారు. అలంపూర్‌లో బీజేపీకి, గద్వాలలో కాంగ్రెస్‌కు ఆర్థికబలం, అంగబలం, స్థానబలం లేని నాయకులు ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఏదో ఒక పార్టీ నుంచి ఒకరు టికెట్‌ పొందేందుకు వీలుంది. అయితే ఇప్పటికే ఆయా పార్టీల్లో ఉన్న వారిలో కూడా టికెట్‌ ఆశించేవారు ఉన్నారు. వారిని కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే టీ-ఆర్‌ఎస్‌ ఆశావహులకు టికెట్‌ దక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement