Sunday, April 21, 2024

Breaking: కృష్ణానదిలో చిక్కుకున్న 200మంది స్వాములు

200మంది శివ‌స్వాములు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కృష్ణానదిలో చిక్కుకున్న ఘటన చోటుచేసుకుంది. 200 మంది స్వాములు మరబోటులో సంగమేశ్వరం వెళ్తున్నారు. అయితే అధికారులు ఏపీలోకి మరబోట్లు అనుమతించడం లేదు. నది మధ్యలోని ద్వీపంలో బోటు యజమానులు వదిలేశారు. దీంతో శివస్వాములు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇతర బోట్లలో స్వాములను పోలీసులు తరలిస్తున్నారు. కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement