Saturday, November 9, 2024

శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీగా ప‌ట్టుబ‌డ్డ బంగారం.. సూట్‌కేసు హ్యాండిల్‌లో తీసుకొస్తుంటే..

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.1.20కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సూట్‌కేస్‌ రాడ్‌లో దాచి తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement