Tuesday, May 7, 2024

Health – కెసిఆర్ కు ప్ర‌కాశ్ రాజ్ ,ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర అజాద్ తదితరులు ప‌రామ‌ర్శ‌..

హైద‌రాబాద్ : య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ప‌లువురు సెల‌బ్రిటిస్ ప‌ర‌మార్శించారు.. నేటి ఉద‌యం సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ య‌శోద హాస్ప‌ట‌ల్ కు వెళ్లి కెసిఆర్ని క‌లిశారు..అయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఎమ్మెల్సీ క‌విత ను ఆడిగి తెలుసుకున్నారు..కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌కాశ్ రాజ్ ఆకాంక్షించారు

ఇక భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ , బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత,

ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి న‌ర్సింహులు, బీఆర్ఎస్ నాయ‌కుడు చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement