Thursday, December 5, 2024

Breaking: లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్..

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వటానికి రైటర్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశారు. రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement