Monday, May 20, 2024

ఆరోగ్య తెలంగాణకు కల సాకారం చేద్దాం: హరీశ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని సూచించారు. తెలంగాణ ఆయుష్ ఫార్మాసిస్ట్ సెంట్రల్ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని  మంత్రి హరీశ్ రావు సోమవారం కొకాపేట లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షులు ప్రకాష్ రావు, జనరల్ సెక్రటరీలు జయ ప్రకాష్ రెడ్డి, సుధారాణి, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మోహన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement