Friday, April 26, 2024

హ్యాపీ బ‌ర్త్ డే బావ‌.. హ‌రీశ్ రావుకి.. క‌విత బ‌ర్త్ డే విషెష్

హ్యాపీ బ‌ర్త్ డే బావ అని ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ క‌విత‌.. కాగా నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌.. వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు పుట్టిన‌రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా గ్రీటింగ్స్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే బావ’ అని ట్వీట్ చేశారు. గతంలో ఓ అధికారిక కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్న ఫొటోను షేర్ చేశారు. కేసీఆర్ సోదరి కుమారుడు హరీశ్ రావు అనే విషయం తెలిసిందే.కాగా క‌విత చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement