Wednesday, May 1, 2024

NZB: పెన్షనర్లను భారం అనుకునే రోజులు పోవాలి… కోదండరామ్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 19 (ప్రభ న్యూస్): పెన్షనర్లను ప్రభుత్వాలు భారం అనుకునే రోజులు పోవాలని… పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు, తెలం గాణ రాష్ట్ర ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇవాళ నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30ఏళ్లుగా ఒక సంస్థకు సేవచేసిన తరువాత బయట వేరే పని చేయలేమన్నారు. 2000 సంవత్సరాలు వరకు చాలీచాలని జీతాలు ఉండేవన్నారు. ఇప్పుడున్న జీతం ఖర్చులు పెరిగి పిల్లల చదువు, ఇంటికి ఎప్పటికప్పుడు సరిపోతుందన్నారు. భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప ఇల్లు గడిసే పరిస్థితి లేదన్నారు. రిటైర్ అయ్యాక ప్రభుత్వంపై ఆధార పడొద్దని ప్రభు త్వాలు ఆలోచిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికి చేసిన మేలు ఏమి లేదన్నారు. వ్యాపార దృష్టి కోణం లేనప్పుడు ప్రభుత్వం ఉద్యోగులను ఒక దృష్టి కోణంలో చూశాయన్నారు.

కొత్త పెన్షన్ స్కీమ్ కింద ఆరోజు ప్రభుత్వాలు సామాజిక.. విద్య, వైద్యం కానీ వృద్ధాప్యంలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చేపలు పట్టడం నేర్పించడం ఎంత ముఖ్యమో.. చేపలు దొరకనపుడు సహకారం అందించడం ప్రభుత్వం చేయాలని ఉదాహరణగా చెప్పారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవస్థకు సహాయం చేయడానికి వెనక్కి పోవడం లేదన్నారు. దేశంలో వనరులు ఇప్పించడానికి, కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇప్పించడానికి ముందుకు వస్తున్నారన్నారు. 7.5లక్షల తొమ్మదిన్నర సంవత్సరాల్లో మాఫీ చేయించిన ప్రభుత్వాలు, పెన్షనర్స్ కోసం పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించారు. తమ పెన్షనర్ల సంక్షేమం పట్టించుకోకుంటే మీ సంక్షేమ మాకెందుకు.. అని అడగాల్సిన అవసరం, ఆలోచన చేయాల్సిన అవకాశం ఉందన్నారు. ఒక ప్రభుత్వం ఓడిపోతే ఇంత సంబరపడటం ఎన్నడూ చూడలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement