Tuesday, May 7, 2024

గోపాలమిత్ర ఎంపికలో గోల్ మాల్ … న్యాయకోసం కలెక్టర్ కు బాధితుడు ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ (14:ప్రభ న్యూస్) – నిజామాబాద్ జిల్లాలోని పశుసంవర్దక శాఖలో గోపాలమిత్ర ఎంపికలో అవక తవకలు జరిగాయని… స్థానికేతరులకు అవకాశం కల్పించకుండా ఇతర జిల్లా వాసికి నియామకం చేశారని నాకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని.. బాధితుడు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాం శమైంది.. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం సుంకిటి గ్రామానికి చెందిన బి. తరుణ్ కుమార్ గోపాలమిత్రకు దరఖాస్తు చేసుకున్నాడు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పశుసంవర్దిక శాఖలో గల గోపాలమిత్ర ఉద్యోగాని కోసం అభ్యర్థులు కావాలని గ్రామంలో కేంద్రాన్ని ఏర్పటు చేసారు. తరుణ్ కుమార్ గోపాలమిత్ర నియామకానికి గ్రామ సర్పంచ్ తీర్మానం పత్రంతో ఆసరా చేసుకొని సారంగపూర్లో గల DLPA – కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. మౌఖిక పరీక్ష ఉంటుందనీ కార్యాలయ సిబ్బంది చెప్పారు. పరీక్ష సమాచారాన్ని సదరు అభ్యర్థికి సమాచారం ఇవ్వలేదు. మౌఖిక పరీక్ష నిర్వహణ సమయాని కోసం అధికారులను సంప్రదిస్తే ఆ రోజు వాయిదా వేశాము అని తదుపరి ‘చెప్తాం అని అక్కడ నుండి పంపించి వేసారు.

తీరా స్థానికేతరులకు అవకాశం కల్పించకుండా అధికారులు గ్రామ సర్పంచ్ తీర్మానం లేకపోయినా ఇతర జిల్లా వాసి అయిన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం పై అధికారుల తప్పిదం నిలువెత్తు సాక్ష్యం లా కనిపిస్తుందన్నారు… స్థానికులకు అవకాశం కల్పించాలన్న నిబంధనను అధికారులు తుంగలో తొక్కి ఇతర జిల్లా వాసిని ఎంపిక చేయడం పై అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వం వెంటనే స్పందించి పశుసంవర్ధక శాఖలో అధికారుల అలసత్వం పై గోపాలమిత్ర ఎంపికపై ప్రత్యేక విచారణ చేసి నాకు న్యాయం చేయాలని బాధితుడు తరుణ్ కుమార్ ప్రజావాణిలో తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement