Monday, April 29, 2024

Letter to CM: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వండి సార్‌… సీఎం రేవంత్‌రెడ్డికి చిన్నారి లేఖ

ఓ చిన్నారి విద్యార్ధినీ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆధిబట్లకు చెందిన విద్యార్థిని అంజలి లేఖ‌లో త‌న సందేశాన్ని పంపింది.

లేఖ‌లో ఏం రాసిందంటే…గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమష్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి” అని లేఖ రాసి పోస్ట్ చేసింది. తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ అందించాలంటూ రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తన సందేశాన్ని తెలియజేసింది. ఉచిత కరెంటును స్కూళ్లకు ఇవ్వాలంటూ లేఖ రాయడం పట్ల ఆ విద్యార్ధినిని అందరూ అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement