Friday, May 17, 2024

Followup: బాలికపై గ్యాంగ్‌రేప్‌, పార్టీ కోసం పబ్‌కెళ్లిన మైనర్‌.. ఇంటివద్ద దిగబెడతామని చెప్పి ఆ ప‌ని..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌ జూబ్లిdహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకువెళ్తామని నమ్మించి కొందరు కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూబ్లిdహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లిహిల్స్‌లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది. అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో ఎనిమిది మంది యువకులు బయలుదేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, మరో ప్రజా ప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి గం.6.15 వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలికతో పాటు ప్రజాప్రతినిధి కుమారుడు, అతని స్నేహితులు నలుగురితో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30 గంటలకు జూబ్లిహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ఆ తర్వాత బాలిక ఫోన్‌ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి జూబ్లిdహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇన్నోవా కారులో 16, 17 ఏళ్ల బాలురు ఉన్నారని, వారిలో ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసుల అదుపులో వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కుమారుడు
బాలిక అత్యాచార ఘటనతో నిందితుడిగా పేర్కొంటున్న వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ మసి ఉల్లాఖాన్‌ కుమారుడు మహ్మద్‌ ఖాదర్‌ ఖాన్‌తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని హైదరాబాద్‌ నగర శివార్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురి కోసం ఆరా తీయగా వారు గోవాలో ఉన్నట్లు తేలింది. వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత
పబ్‌కు వెళ్ళిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సంపన్నులు, రాజకీయ నేతల పిల్లలను పోలీసులు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జూబ్లిహిల్స్‌ పోలీసుస్టేషన్‌లోకి దూసుకు వెళ్ళిన కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల కాషాయ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే రేప్‌కు పాల్పడ్డ నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ బైఠాయించారు. పోలీసుస్టేషన్‌లో ధర్నాకు దిగిన వారిలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పలువురు యువమోర్చ, మహిళా మోర్చ కార్యకర్తలు, నాయకులున్నారు. పోలీసుస్టేషన్‌లో బైఠాయించి విధులకు ఆటంకం కల్పించిన వారందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement