Friday, May 17, 2024

బలమైన ప్రతిపక్షం కావాలి – ప్రధాని మోడీ

న్యూఢిల్లి : భారతదేశానికి శక్తివంతమైన ప్రతిపక్షం, ప్రజాస్వామ్యానికి అంకితమైన రాజకీయపార్టీల ఆవశ్యకత ఎంతో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌ జిల్లా పరూక్‌నాథ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయపార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వ్యక్తిగతంగా తనకు ఏ రాజకీయ పార్టీ, వ్యక్తులతో విబేధాలు లేవని ఈసందర్భంగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశానికి బలమైన ప్రతిపక్షం ఉండాలని భావిస్తున్నాను తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని అన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలికితే, గ్రామాల్లో జన్మించిన వారు సైతం ప్రధానమంత్రి, రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement