Monday, May 29, 2023

16కోట్ల మంది డేటా చోరీ.. ఆరుగురు అరెస్ట్

వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. సుమారు 16 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి విక్రయించినట్లు గుర్తించిన అధికారులు దేశవ్యాప్తంగా కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ పరిధిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నాగ్ పూర్, ఢిల్లీతో పాటు ముంబైకి చెందిన ముఠాగా గుర్తించామన్నారు. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు.

- Advertisement -
   

దేశ భద్రతకు భంగం కలిగేలా డేటాను అపహరిస్తున్నారన్న సీపీ బీమా, లోన్లుకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటాను చోరీ చేశారని వెల్లడించారు. ఇన్సూరెన్స్, లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 4లక్షల మంది డేటా, 7లక్షల ఫేస్ బుక్ యూజర్స్ డేటా చోరీ చేశారని సీపీ తెలిపారు. ఐటీ ఉద్యోగుల డేటానూ చోరీ చేశారన్నారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటివ్ డేటాను కూడా అమ్మకానికి పెట్టారన్నారు. ఈ డేటాను సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్లు క్రెడిట్ కార్డుల ఇష్యూ కోసం ఒక ఏజెన్సీని పెట్టుకున్నారన్నారు. ఆ ఏజెన్సీ ఉద్యోగి డేటాను అమ్ముకున్నాడన్నారు. వీరి వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement