Thursday, May 2, 2024

పోటీ ప‌రీక్ష‌ల‌కు ఉచిత కోచింగ్..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: జాతీయా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హజరయ్య మైనారిటీ విద్యార్థులకు ఫౌండేషన్‌ కోర్సులకు సంబంధించి ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కి ల్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసిం తెలిపారు. 60 రోజుల పాటు కోచింగ్‌ ఉంటుంద న్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామ న్నారు.

ఆసక్తి ఉన్న మైనారిటీ విద్యార్థులు తమ దరఖాస్తులను స్టడీ సర్కిల్‌లో డిసెంబర్‌ 4వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. జామియా నిజా మియా కాంప్లెక్స్‌లో ఉన్న స్టడీ సర్కిల్‌ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలన్నారు. ఇతర వివరాలకు040 – 232361112 నెంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement