Sunday, May 5, 2024

వ్య‌వ‌సాయ‌రంగం వైపు దృష్టి సారించండి – యువ‌త‌కి పిలుపునిచ్చిన మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్ లోని జ‌య‌శంక‌ర్ వ‌ర్సిటీ ఆడిటోరియంలో సీఐఐ ఆధ్వ‌ర్యంలో హై అగ్రిటెక్ సౌత్ 2022స‌దస్సు జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నిరంజ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు..యువత వ్యవసాయరంగం వైపు మళ్లాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. సాగును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని చెప్పారు. ఈ సందర్భంగా అగ్రిటెక్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతుబంధు పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది విడతలు సాయమందించామని చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమచేశామన్నారు. సన్నకారు రైతులకు ప్రపంచస్థాయి సాంకేతికత చేరవేయాలని సూచించారు. శారీరక శ్రమ, పెట్టుబడి ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు జరగాలని మంత్రి చెప్పారు. రాబడి పెంపు సవాళ్లను తగ్గించేందుకు సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement