Friday, May 3, 2024

పొంగి పొర్లుతున్న కూడలి వాగు – శనిగకుంటకు నిలిచిపోయిన రాకపోకలు

మంగపేట, జూలై 26 ( ప్రభ న్యూస్ ) : ములుగు జిల్లా మంగపేట మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మంగపేట మండలంలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలలో వరద నీటితో నాటు వేసిన వరి పొలాలు, వరి నారు మడులు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన మండలంలోని పలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

రమణక్కపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో లోతట్టు ప్రాంతంలోని పలు ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. కమలాపురంలో ఎర్రవాగు, మంగపేటలో గౌరారం వాగు, రాజుపేటలో ముసలమ్మవాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. నర్సింహసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శనిగకుంట సమీపంలోని కూడలి ఒర్రె ( వాగు ) ఉదృతంగా ప్రవహిస్తుండడంతో శనిగకుంట గ్రామానికి బాహ్య ప్రపంచానితో సంబంధాలు తెగిపోయాయి. ===== ఎండ్ =====

Advertisement

తాజా వార్తలు

Advertisement