Wednesday, May 1, 2024

TS: ఓటుతో కుటుంబ పాలనకు చెరమ గీతం పాడాలి.. బండి సంజయ్

నిర్మల్ ప్రతినిధి బైంసా, నవంబర్ 18 (ప్రభ న్యూస్) : ఓటుతో కుటుంబ పాలనకు చెరమ గీతం పాడాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. శనివారం బైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు… మహిషా అంటేనే ఏదో కొత్త జోష్ వస్తుందని, ఇక్కడి బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఇప్పటికీ నవ యువకుడిలా పోరాడుతున్నారని అన్నారు. ఎంతో మంది బలిత్యాగాల వల్ల తెలంగాణ సాధించుకున్నామని, ఆనాడు సుష్మా స్వరాజ్ ఒత్తిడితో తెలంగాణ వచ్చిందని అంతేకానీ కేసీఆర్ దొంగ దీక్షతో తెలంగాణ రాలేదని అన్నారు. ప్రతి ఒక్క పార్టీ పథకాలు, హామీలు ఇస్తామని చెప్పడం తప్ప తెలంగాణపై ఉన్నటువంటి అప్పునేలా తీరుస్తారని చెప్పడం లేదన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఒక్క లక్ష ఇరవై వేల అప్పువుందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పల నుండి తీర్చే పార్టీ బీజేపీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో గెలిచిన అభ్యర్థులు బీ.ఆర్.ఎస్ లో చేరడం ఖాయమని అన్నారు. రామారావు పటేల్ గెలిచాక ముధోల్ తాలూకా అభివృద్ధి కోసం తాలుకాని దత్తత తీసుకుంటానని, కేంద్ర నిధులతో సైతం అభివృద్ధి చేస్తానని తెలిపారు. దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అస్సలు మతవిద్వేషాలు చెలరేగలేదని, రాష్ట్రం, తాలూకాలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు లాంటిది ఉండవన్నారు.

భైంసా అల్లర్లలో హిందూ సమాజం బాగా నష్టపోయిందని, హిందూ సమాజానికి అండగా ఉన్నటువంటి ధర్మరక్షకులకు జోహార్లంటూ తెలిపారు. రానున్న రోజుల్లో బైంసాలో ప్రతి ఇంటి నుండి ఒక శివాజీ, రాణి రుద్రమదేవి, ఝాన్సీ బాయిలు తయారు కావాలని పిలుపునిచ్చారు. ఇందులో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, బీజేపీ జిల్లా ఇన్చార్జి మల్లారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యగారు భూమయ్య, అల్జాపూర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement