Wednesday, May 1, 2024

క‌లెక్ట‌రేట్ లో వ‌ర‌ద‌ల‌పై – మంత్రి కేటీఆర్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

సిరిసిల్ల – భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఎలాంటి ప్రాణం నష్టం జరగకుండా చూడాలని ఐటి మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి కేటీఆర్ అధికారం ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేనివిధంగా జులైలో అత్యధిక వర్షపాతం నమోదయిందని ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణంగా కంటే 450% ఎక్కువ వర్షపాతం నమోదయిందని అన్నారు. పెద్దపల్లి జగిత్యాల నిర్మల్ ప్రాంతాల్లో మాదిరిగా అసాధారణమైన పరిస్థితులు జిల్లాలో లేవని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించకుండా లక్ష్యంగా ఉండొద్దని ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికప్పుడు జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.

జిల్లాలోని 656 చెరువుల పరిస్థితి పై ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని చెరువులు పతిష్టంగా ఉన్నాయని జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి మంత్రికి వివరించారు. బోయిన్పల్లి ఇల్లంతకుంట మండలాల్లో మద్యమానరు జలాశయం వీక్షించేందుకు వెళ్లే సందర్శనలను నియంత్రించాలని అన్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనీలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని అన్నారు. అభివృద్ధి పనులు జరిగే సైట్లలో హెచ్చరిక బోర్డులు పెట్టాలని బ్యారికెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మిషన్ భగీరథ నీరు కలుస్తాం కాకుండా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లాలోని సరఫరా చేసిన వీటిని ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఆదేశించారు.జిల్లాలో ఉన్న మిషన్ భగీరథ కనెక్షన్ల ప్రకారం అంతర్జాతీయ నన్నెత ప్రమాణాల ప్రకారం పరీక్షించే శాంపిళ్లను మరింత పెంచాలని సామర్ధ్యం పెంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి. మున్సిపల్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ వ్యవసాయ అనుబంధ రంగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement