Thursday, May 2, 2024

Election Code : హైదరాబాద్‌ నుంచి రేసింగ్‌ పోటీలు తరలింపు

హైదరాబాద్ లో జరగాల్సిన రేసింగ్ పోటీలను అక్కడ నిర్వహించడం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా నగరంలో జరగాల్సిన రెండు రేసింగ్‌ పోటీలు రద్దయ్యాయి. ఈనెల 4, 5 తేదీల్లో నెక్లెస్‌ రోడ్‌ వేదికగా ఎఫ్‌4 ఇండియన్‌ చాంపియన్‌షిప్, ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నిర్వహించాల్సి ఉంది.

అయితే ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలతో వీటిని ఇక్కడ జరపడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. ఈ రెండు రేస్‌లను హైదరాబాద్‌ నుంచి తరలిస్తున్నామని, ప్రకటించిన ఆ రెండు తేదీల్లోనే చెన్నైలో నిర్వహిస్తామని వారు వెల్లడించారు. రేస్‌ల కోసం ఇప్పటికే టికెట్లు కొన్నవారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement