Monday, April 29, 2024

NZB: కలెక్టరేట్ ముట్టడికి విపలయత్నం… బిజెపి నాయకుల అరెస్టు

నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనపాల్ సూర్యనారాయణ, బిజెపి నాయకులు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా కలెక్టరేట్లోకి చర్చికి వెళ్లే ప్రయత్నం చేయగా.. కొంతమేరకు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు బిజెపి నాయకులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ధ‌నపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బిజెపి కలెక్టరేట్ ముట్టడి పిలుపునిస్తే పోలీసులు అర్థరాత్రి నుంచి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. కానీ కార్యకర్తలు, ప్రజలు ఈ మోసపూరిత కేసీఆర్ హామీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున పోలీసుల కనుసనల్లో పడకుండా త‌మతో ముట్టడికి రావడం జరిగిందన్నారు. తాము అడిగేది మీరు ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి కావచ్చు, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇవన్నీ ఇవ్వకుండా మోస‌పూరిత వైఖరిని ప్రజల్లో ఎండగడుతున్నారని తెలిపారు.


వెంటనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తది, ప్రజలతో క‌లిసి పోరాటం చేస్తాం మీ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామ‌న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డంరాజు, బూర్గుల వినోద్ గోపిడి వినోద్ రెడ్డి మట్టం పవన్, అంత రెడ్డి, హరీష్ రెడ్డి, పవన్, ముందడ బట్టి కార్ ఆనంద్ భీమన్న, శ్రీను విష్ణు, టెంట్ హౌస్ సీను, సీనియర్ బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement