Friday, April 26, 2024

సగరుల అభ్యున్నతి కోసం కృషి : ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

సగర ఉప్పర కులస్తుల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని 126 జగద్గిరి గుట్ట డివిజిన్ సగర (ఉప్పర) సంఘం అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం సభ్యులు కార్పొరేటర్ కొలుకుల జగన్ తో కలిసి ఈ రోజు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నూతన అధ్యక్ష కార్యదర్శులను, కోశాధికారిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాజిక వర్గం అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, క్రమ శిక్షణతో ఐక్యమత్యంతో సంఘం సభ్యులు ముందుకు సాగడం అభినందనీయమన్నారు.

నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటూ సగరుల అభ్యున్నతి కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. అలాగే జగద్గిరి గుట్ట సగర (ఉప్పర) సంఘంకు నూతనంగా ఎన్నుకోబడిన సగర సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం, వారు ఐక్యమత్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సగర మహిళా భవనం నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్కే దయ సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కాని శ్రీనివాస్ సాగర్ (కన్మనూర్), కోశాధికారి వేముల సుదర్శన్ సాగర్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఆస్కాని తిరుపతమ్మ సాగర్, ప్రధాన కార్యదర్శి ఆర్ డి శాంత, కోశాధికారి పి హేమలత, యువజన సంఘం అధ్యక్షులు ప్రవీణ్ సాగర్, ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రమోహన్ సాగర్, కోశాధికారి దేశెట్టి భాస్కర్ సాగర్ పాటు సాగర (ఉప్పర) సంఘం స్టీరింగ్ కమిటీ సలహాదారులు కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘం, యువజన సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement