Sunday, April 28, 2024

TS : నేటి నుంచి ఏడు పాయల జాతర..

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన ఏడు పాయల వనదుర్గా భవాని జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జాత‌ర కొన‌సాగ‌నుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జాతరకు భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క- సారలమ్మ జాతర తర్వాత జరిగే రెండో అతిపెద్ద వనజాతర కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. మంజీరా నదిలో పుణ్యాస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

- Advertisement -

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మెదక్ జిల్లా కేంద్రం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల ఆలయం ఉంటుంది. మేడారం జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా చెప్పుకోదగినది. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంజీరా నదిలో పుణ్యస్థానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి శివరాత్రి సందర్భంగా 03 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. నేడు మహాశివరాత్రి ఉత్సవాలు,9న బండ్లు తిరుగుట,10న రథోత్సవం వైభవంగా జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement