Monday, December 9, 2024

Drunker – చుక్కేసి… హొర్డింగ్ ఎక్కి యువకుడు హల్ చల్

.నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)5జిల్లా కేంద్రంలోని కంటేశ్వర చౌరస్తా వద్ద యువకుడు హల్ చల్ చేశాడు. కంటేశ్వేర్ చెందిన పెయింటర్ పనిచేసే యువకుడు రవీందర్ ఆదివారం నగరంలో కంటేశ్వర్ చౌరస్తా వద్దగల… ప్రకటనలకు సంబంధించిన హొర్డింగ్ పై తప్పతాగి నిద్రపోయిన ఘటన చర్చ నియాంశంగా మారింది.

.. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హొర్డింగ్ పైన నిద్ర పోయిన యువకుడు కింద పడతాడో నని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమి గూడ డం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యువకున్ని హో ర్డింగ్ పైనుంచి పోలీసులు కిందికి దించారు. రవీందర్ కి సీఐ నరహరి,పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు..

ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం మవుతే కఠినంగా చర్యలు తీసుకుంటామని యువకుడిని హెచ్చరించి వారి తల్లిదం డ్రులకు అప్పగించారు. రవీందర్ గతంలో కూడా హొర్డింగ్ పై నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి…

Advertisement

తాజా వార్తలు

Advertisement