Sunday, April 28, 2024

KTR: ప్ర‌ధాని ఎవ‌రో కూడా తెలియ‌దా… బీజేపీ నేత‌ల‌పై కేటీఆర్

బీఆర్ఎస్ నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట‌ర్) వేదిక‌గా బీజేపీ నేత‌లు భార‌త తొలి ప్ర‌ధాన‌మంత్రి విష‌య‌మై చేసిన వ్యాఖ్య‌ల‌పై చుర‌క‌లు అంటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న‌ సినీ నటి కంగనా రనౌత్ ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన‌ చర్చా వేదిక‌లో మాట్లాడుతూ… నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ స్వాతంత్ర భార‌త తొలి ప్ర‌ధాని అని నోరు జారారు. ఇదే విష‌య‌మై ‘ఎక్స్’ వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు వేశారు.

“ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌న తొలి ప్ర‌ధాన‌మంత్రి అని అంటారు. ద‌క్షిణాదికి చెందిన మ‌రో బీజేపీ నేత మ‌హాత్మాగాంధీ మ‌న ప్ర‌ధాని అని చెబుతారు. అస‌లు వీళ్లంతా ఎక్క‌డి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో ?” అని కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement