Friday, May 3, 2024

ధాన్యం కొనుగోళ్ల‌పై అల‌స‌త్వం వ‌ద్దు.. మంత్రి ఎర్ర‌బెల్లి

జనగామ, ఏప్రిల్ 29 ప్రభ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలుపై అధికారులు అలసత్వం వహించరాదని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలుపై మంత్రి ఎర్రబెల్లి దాకా రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇటీవల వడగళ్ల వర్షం పంట నష్టపోయిన రైతులకు తక్షణమే వివరాలు సేకరించాలని, అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలులో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఎగుమతి చేయాలన్నారు.

అందుకు ట్రాన్స్ ఫోర్ట్ సక్రమంగా కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని రైతులకు ఎలాంటి నష్టం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్డిఓ పిడి రాంరెడ్డి, పౌరసరఫరాల జిల్లా అధికారిని రోజా రాణి, సివిల్ సప్లై డిఎం సంధ్యారాణి రోజా రాణి మున్సిపల్ కమిషనర్ రజిత, ఆర్డీవోలు, వివిధ‌ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement