Tuesday, April 30, 2024

గద్వాలలో వందే భారత్ రైలుకు స్వాగతం పలికిన డీకే అరుణ

జోగులాంబ గద్వాల (ప్రతినిధి)సెప్టెంబర్ 24 (ప్రభ న్యూస్)జోగులాంబ గద్వాల జిల్లా:ఆదివారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం రోజు మొట్టమొదటిగా పాలమూరు జిల్లాకు వస్తున్న సందర్భంగా స్వాగతిస్తూ అనంతరం గద్వాలకు అదే రైళ్లలో ప్రయాణించి గద్వాల నుండి కర్నూలు బయలుదేరిన వందే భారత్ రైలు ను జెండా ఊపి ప్రారంభించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ.

అంతకముందు బిజెపి నాయకులు, బీజేపీ శ్రేణులు రైల్వే అధికారులు , రైల్వే సిబ్బంది, ప్రజలు బారత్ మాతాకీ జై, వందే భారత్ అంటూ పెద్ద ఎత్తున వందే భారత్ కు స్వాగతం పలికారు. ముందుగా రైల్వే అధికారులు డికె. అరుణని శాలువతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ..త్వరలో గద్వాలలో వందే భారత్ రైలుని ఆపేందుకు అధికారులను కోరడం జరిగిందని అన్నారు. సామాన్య మానవునికి విమానం ఎక్కే పరిస్థితి ఉండదని అంతకంటే అద్భుతంగా విశాలంగా వందే భారత్ రైలులో అంతకంటే ఎక్కువ వసతులు, సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలని వందే భారత్ రైళ్లు మార్గాలు, అభివృద్ధి పనులు నరేంద్ర మోడీ నాయకత్వంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రజలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సమయం కలిసి వస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వేలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రపంచ స్థాయిలో ఆధునీకరణ చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీకే అరుణ తో పాటు బిజెపి నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్ రాములు, రామాంజనేయులు, కౌన్సిలర్ రజక జయశ్రీ నరసింహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బండల పద్మావతి, కౌన్సిలర్ బండల పాండు, నాగేందర్ యాదవ్, డిటిడిసి నర్సింహులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, మాల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement