Saturday, May 18, 2024

IND vs AUS | ఫ‌స్ట్ ఓవ‌ర్లోనే రెండు వికెట్లు ఫ‌ట్..

ఆసిస్ భార‌త్ మ‌ధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భాగంగా చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు ఫ‌స్ట్ ఓవ‌ర్ లోనే రెండు వికెట్ల‌ని కోల్పోయింది. 400 ప‌రుగుల‌ భారీ టార్గెట్ తో భ‌రిలోకి దిగింది ఆసిస్. కాగా, మొద‌టి ఓవ‌ర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ అవుట్ అయ్చారు. ఇక‌, ప్రస్తుతం డేవిడ్ వార్నర్,మార్నస్ లాబుస్చాగ్నే క్రీజ్ లో ఉన్నారు. 2 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు ప‌రుగులు చేసింది.

ఇండోర్ స్టేడియం వేధిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన‌ భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లలో రుతురాజ్​ గైక్వాడ్​ (8) పరుగులకే అవుటయినా మిగతా వారు దంచికొట్టడంతో టీమిండియా మంచి స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 399 పరుగులు చేసి కేవలం అయిదు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇక… ఆస్ట్రేలియా ముందు 400 పరుగుల భారీ లక్ష్యం పెట్టారు భారత బ్యాటర్లు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ (8), గిల్ (104), శ్రేయ‌స్ (105), కేఎల్ రాహుల్ (52), ఇశాన్ కిష‌న్ (31), సూర్య‌కుమార్ 72, జ‌డేజా 13 ప‌రుగుల‌తో అద్భుతంగా రాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement