Thursday, May 16, 2024

సంక్రాంతి భ‌రిలో అయలాన్‌.. మూవీ టీజ‌ర్ రిలీజ్ పై లేటెస్ట్ అప్‌డేట్

రవికుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్‌’. ఈ మూవీని కోటపాడి రాజేష్‌, ఆర్‌ డి.రాజా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

అయితే, వీఎఫ్ఎక్స్ వర్క్స్ విశ‌యంలో ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇవ్వాలని భావిస్తున్నారు మేకర్స్. దీంతో కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇక‌ వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అక్టోబర్ మొదటి వారంలో ‘అయలాన్’ విడుదల చేయనున్న‌ట్టు ప్రకటించారు. ఈ సినిమాలో నటి ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, కరుణాకరన్, భానుప్రియ, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement