Saturday, April 27, 2024

వంతెన మరమ్మతులతో వాహనాల దారిమళ్లింపు..డీఐజీ ఎల్.ఎస్.చౌహన్

మహబూబ్ నగర్ క్రైమ్: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య గల NH-167 హైవే నందు కృష్ణానదిపై నారాయణపేట్, రాయచూరు జిల్లాల బార్డర్ లో గల వంతెన మరమ్మతులు జరుగుతున్నందున ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుండి 25వ తేదీ వరకు నాలుగు రోజులు వివిధ దారుల నుండి వచ్చే వాహనాలకు దారిమల్లింపు చేయడం జరిగిందని జోగులాంబ జోన్ 7 డిఐజి ఎల్.ఎస్ చౌహన్ తెలిపారు. హైదరాబాద్ నుండి రాయచూర్ వైపుగా వెళ్లే వాహనదారులు జడ్చర్ల, భూత్పూర్, కొత్తకోట, పెబ్బెర్, ఎర్రవల్లి చౌరస్త నుండి కుడివైపు తిరిగి గద్వాల్, కేటిదొడ్డి నుండి రాయచూర్ వైపు వెళ్లవలేనని అన్నారు.

వికారాబాద్, కొడంగల్, తాండూర్, కొస్గి, మహ్మదాబాద్, హన్వాడ, మహబూబ్ నగర్ చుట్టూ ప్రక్కల గ్రామాలలోని వాహనాలు, టౌన్ పోలీస్ స్టేషన్ వయా భూత్పుర్, కొత్తకోట, పెబ్బేర్, ఎర్రవల్లి చౌరస్తా కుడివైపు తిరిగి గద్వాల్, కేటిదొడ్డి నుండి రాయచూర్ వైపు వెళ్ళవలేనని తెలిపారు. దేవరకద్ర నుండి రాయచూర్ వైపు వెళ్లే వాహనదారులు మరికల్ సబ్ స్టేషన్ దగ్గర ఎడమవైపు తిరిగి చిత్తనూర్, రాంపూర్ గేటు, ఉంద్యాల, అమరచింత, మస్తీపూర్, కిష్టంపల్లీ, నందిమల్ల, జూరాలడ్యాం, థరూర్ పొలీస్ స్టేషన్, చిన్నచింత రేవుల, ధరూర్ గ్రామం, కేటిదొడ్డి నుండి రాయచూర్ వైపు వెళ్లవచ్చని పేర్కొన్నారు. అదేవిదంగా కల్వకుర్తి నుండి రాయచూర్ వైపు వెళ్లే వాహనదారులు జడ్చర్ల నుండి వయా భూత్పూర్, కొత్తకోట, పేబ్బేర్, ఎర్రవల్లి చౌరస్తా కుడివైపు గద్వాల్, కేటి దొడ్డి నుండి రాయచూర్ వైపు వెళ్లాలన్నారు. నాగర్ కర్నూల్ నుండి రాయచూర్ వైపు వెళ్లే వాహనదారులు బిజనపల్లి, భూత్పూర్, కొత్తకోట, పెబ్బేర్, గద్వాల్ నుండి రాయచూర్ వైపు వెళ్ళవచ్చని, ముఖ్యంగా వాహనదారులు ఈ నాలుగు రోజులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement