Monday, April 29, 2024

ఐలాపూర్ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

తెల్లతెల్లవారే విరుచుకుపడ్డ యంత్రాంగం
ఐలాపూర్ ప్రభుత్వ భూములపై ఆంధ్రప్రభ వరుస కథనాలు
స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం
100 కు పైగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు


ఉమ్మడి మెదక్ బ్యూరో/పఠాన్ చెరు, మే 13 (ప్రభ న్యూస్) : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ లో ప్రభుత్వ భూముల అక్రమణపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత నెల ఏప్రిల్ లో ఐలాపూర్ ప్రభుత్వ భూములపై ఆంధ్రప్రభ వరుస కథనాలు ప్రచురించింది. ప్రస్తుతం ఐలాపూర్ గ్రామ సర్వే నెంబర్ 1 నుండి 220 వరకు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ భూములే అని ప్రభుత్వం వాదిస్తుండగా, కొన్ని సర్వే నెంబర్ల భూములు ప్రయివేట్ భూములని కొనుగోలుదారులు కోర్టుకెళ్లగా ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. కోర్టు పరిధిలో పెండింగ్ లో ఉన్న భూముల్లో యథేచ్ఛగా కబ్జాదారులు వందలకు వందలు 60 గజాలు, 80 గజాలు, 100 గజాల్లో ఇల్లు నిర్మించి విక్రయించారు.

ఫలితంగా 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసిన రెవెన్యూ, పంచాయతీ శాఖలు జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వడం పోలీసు ప్రొటెక్షన్ తో శనివారం తెల్లవారుజామునే దాదాపు 300 – 400 మంది పోలీసులు, ఫైర్ ఇంజిన్లు, జేసీబీ, హిటాచి లతో రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు తెల్ల తెల్లవారుతుండగానే అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడి వాటిని నేలమట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement