Thursday, May 16, 2024

మద్దతు ధర చెల్లించేందుకే వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు – ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – రైతాంగం కష్టపడి పండించిన పంటకు మద్దతు ద్వారా చెల్లించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి, కొదురుపాక గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, ఛైర్మెన్ బుర్ర మౌనిక శ్రీనివాస్,ఛైర్మెన్ మోహన్ రావు,గ్రామ సర్పంచ్ కోమల-సారయ్య,దేవరనేనిసాగర్ రావు,ఉప సర్పంచ్ స్వరూప-గంగమల్లు,గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ ,సురేష్,రైతు సమితి గ్రామ కో ఆర్డినేటర్ సురేందర్ రావు, డైరెక్టర్ విజయ్,బీఆర్ఎస్ నాయకులు తూముల రామస్వామి,తోడేటి బాలాజీ, ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement