Thursday, May 9, 2024

Breaking : ఇండోనేసియాలో భారీ భూకంపం

వెంట వెంట‌నే రెండుసార్లు భూకంపం వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న ఇండోనేసియాలో చోటు చేసుకుంది. ఆదివారం ఇండోనేసియాలోని కెపులౌన్‌ బటులో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదట 6.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూరోపియన్‌ మెడిటేరియన్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ (EMSC) తెలిపింది. గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని వెల్లడించింది. మొదటిసారి భూ అంతర్భాగంలో 43 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకోగా, రెండోసారి 40 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చాయని ఈఎంఎస్సీ చెప్పింది. ఈనెల 3న సుమత్రా దీవుల్లో కూడా భూమి కంపించింది. 6.1 తీవ్రత నమోదవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement