Sunday, May 5, 2024

TS | సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణనాయక్‌ బదిలీ

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారాయణనాయక్‌ బదిలీ అయ్యారు. అయ‌నని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవ్వాల (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఇదివ‌రకే ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్‌-2 ఐజీపీగా పనిచేస్తున్న తరుణ్‌ జోషిని రామగుండం సీపీగా నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement