Friday, May 3, 2024

Be Care | సైలెన్సర్లు మోడీఫై చేస్తే క్రిమినల్ చర్యలు.. పోలీసుల హెచ్చరిక

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. సోమవారం కేయూ క్రాస్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్ తో ధ్వంసం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.

ఇందులో భాగంగా కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనీఖీల్లో నిబంధనలు విరుద్ధంగా అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ పోలీసులు తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సాయంతో రెండు వందలకు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ద్వంసం చేసారు. ధ్వంసం చేసిన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 70 కాగా కాజీపేట 65, వరంగల్ 65 వున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement