Monday, May 13, 2024

మామను హత్య చేసిన అల్లుడు..

మామపై అల్లుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. గంగారం అనే వ్యక్తిపై అతడి అల్లుడు కత్తి దాడి చేశాడు. అయితే ఘటనలో తీవ్ర గాయాలయిన గంగారం అక్కడికక్కడే మృతవ చెందాడు. ఈ ఘటన కాగజ్‌నగర్‌ టీచర్స్‌కాలనీలో చోటు చేసుకున్నది. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: పల్లే ప్రగతిలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ..

Advertisement

తాజా వార్తలు

Advertisement