Sunday, May 5, 2024

Crime – మైనర్ బాలికపై అత్యాచారయత్నం

.వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(వయస్సు14సంవత్సరాలు)పై యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. పాఠశాలలో చదువుతున్న బాలిక గూడూరు మండలంలోని ఓ గ్రామం నుండి గురువారం సాయంత్రం తన స్వగ్రామానికి వస్తుండగా గూడూరు మండలంలోని ఓ తండాకు చెందిన యువకుడు లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి ద్విచక్రవాహనంపై బాలికను తీసుకువస్తూ మార్గమధ్యంలో ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

బాలిక అతన్ని వదిలించుకుని ఇంటికి వెళ్లి విషయం తెలిపినట్లు సమాచారం.కాగా ఈ విషయమై ఎస్.ఐ.శ్రీనివాస్ ని వివరణ కోరగా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement