Monday, April 29, 2024

TS : మ‌రో ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా కొన‌సాగిలించాలి… హైకోర్టులో పిల్‌..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల కింద అధికార మంత్రులు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే వ్యాఖ్యలు చేశారు.దీనికి బలం చేకూరుస్తూ.. తాజాగా..హైదరాబాద్‌ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు.

- Advertisement -

కాగా దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి. ఇదిలా ఉండగా.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉండాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఆ గడువు తేదీ ముగియడంతో మరో పది సంవత్సరాలపాటు కొనసాగించాలని కోర్టులో ఫిల్ వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement