Wednesday, May 1, 2024

Congress – సింహం బ‌య‌ట‌కొస్తే షూట్ చేసేస్తా! ….బిఆర్ఎస్ నేతలకు రేవంత్ కౌంటర్


పిస్ట‌ల్‌తో రెడీ ఉన్నా
బీఆర్ఎస్ నేత‌ల వాఖ్యాలపై రేవంత్ కౌంట‌ర్‌
ఆప్‌కి అదాల‌త్ ప్రోమోలో సీఎం మాట‌లు తూటాలు
ఇంకా రివేంజ్ స్టార్ట్ చేయ‌లేదంటూ కామెంట్
పిల్లిల‌ను, కుక్క‌ల‌ను చంప‌బోను..
నా గురి అంతా సింహంపైనే
రేపు రాత్రి 10 గంట‌ల‌కు ప్ర‌సారం

సింహం బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ద‌న్న బీఆర్ఎస్ నేత‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.. తాను తుపాకితో సిద్దంగా ఉన్నాన‌ని, బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే కాల్చివేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. ఓ టీవీ చాన‌ల్‌ నిర్వహించే ఫేమస్ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు.

రివేంజ్ తీసుకుంటున్నారా?

కేసీఆర్ సర్కారు మిమ్మల్ని జైలులో వేసినందుకు రివేంజ్ తీసుకుంటున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రివేంజ్ ఇంకా స్టార్టే కాలేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తరచూ అంటున్నారు.. సింహం లోపల ఉంది బయటకు వస్తుంది.. అప్పుడు చూడండి అంటున్నారుగా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. రమ్మనండి పిస్టోల్‌తో రెడీగా ఉన్నాం.. ఒక్క తూటాతో అయిపోతుంది అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పిల్లిలు, కుక్కలను చంపనని.. చంపితే సింహాన్నే చంపుతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ కార్య‌క్ర‌మం రేపు రాత్రి 10 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement